ఈటల అసత్యాలే చెప్పారు.. మంత్రి తుమ్మల కౌంటర్‌

Published on Sat, 06/07/2025 - 18:52

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్‌కు ఈటల అసత్యాలు చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఈటల ప్రస్తావించిన సబ్‌ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదని.. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిటీ వేశారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు, సబ్‌ కమిటీకి సంబంధం లేదని తుమ్మల స్పష్టం చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై మాత్రమే సబ్‌ కమిటీ వేశారు. నేనే సుమోటోగా కమిషనర్‌ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నా. సబ్‌ కమిటీ నిర్ణయాలను కమిషన్‌ ముందు ఉంచుతా’’ అని తుమ్మల తెలిపారు.

‘‘చాలా రోజులు అయింది కాబట్టి అనాలోచితంగా ఇచ్చారో తెలీదు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏర్పాటు కోసం వేసిన సబ్ కమిటీ కాదు. మేడిగడ్డ, ప్రాణహిత, కడ్కో పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ లేదు.. రిపోర్ట్ ఇవ్వలేదు. సబ్ కమిటీకి.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం పొందినట్లు ఈటల రాజేందర్ చెప్పారు.. అది వాస్తవం కాదు. కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ రాలేదు. కేబినెట్ ఆమోదానికి కాళేశ్వరం ఏ రోజూ రాలేదు’’ అని తుమ్మల పేర్కొన్నారు.

ఈటలకు తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు. 43 ఏళ్లుగా పద్ధతితో, నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్నాను. నా వ్యక్తిత్వం ఈటల రాజేందర్‌కు తెలుసు. ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్‌ చూశాక కొంత బాధేసింది. ఈటల రాజేందర్ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలీదు. సబ్ కమిటీ రిపోర్ట్‌ను కమిషన్‌కు ఇస్తాను. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ వాంగ్మూలం చాలా బాధాకరం’’ అని తుమ్మల వ్యాఖ్యానించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)