ఎన్నో అవమానాలు.. మంత్రి తుమ్మల కంటతడి

Published on Tue, 08/13/2024 - 14:00

సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.

శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్‌లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్‌కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.

‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్‌లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్‌ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్‌ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్‌ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.

తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్‌తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్‌మెంట్ జూలూరుపాడుకి‌ మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు.

హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టిన మంత్రి తుమ్మల

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)