Breaking News

మీరు ఊళ్లు పాడు చేస్తే.. మేం బాగు చేస్తున్నాం

Published on Thu, 08/08/2024 - 05:49

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గత పదేళ్లలో గ్రామ పంచాయతీలకు నాటి ప్రభుత్వం రూ.10,170 కోట్లను కేటాయించినా కేవలం రూ.5,988 కోట్లనే విడుదల చేసిందని, చివరికి ఆ 44 శాతం నిధులను కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకుందని ఆమె ఆరోపించారు. అలాంటి బీఆర్‌ఎస్‌ నేతలకు ఇప్పుడు మాట్లాడే హ క్కు ఎక్కడిదని సీతక్క నిలదీశారు.

స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సొంత ఆదాయంలో స్థానిక ప్రభుత్వాలకు 11 శాతం నిధులు కేటాయించాలని..అందులో నుంచి 61 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఆరి్ధక సంఘం సిఫార్సు చేస్తే...గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గుర్తు చేశారు.

అప్పుడే వాటా ప్రకారం పంచాయతీలకు నిధులు ఇస్తే ఇప్పుడు సమస్యలు ఉండకపోయేవని పేర్కొన్నారు. ఇలా ఎన్నో రకాలుగా పంచాయతీలను గత ప్రభుత్వం పాడు చేయగా, ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని సీతక్క వివరించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా ఫక్తు రాజకీయాలు చేయడం హరీశ్‌రావు మానుకోవాలని సూచించారు.

3 రోజుల్లో...25 లక్షల మొక్కలు 
రాష్ట్రంలో గత మూడురోజులుగా ’స్వచ్ఛదనం–పచ్చదనం’కొనసాగుతోంది. మంత్రులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు అధికారులు ఉత్సాహంగా స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం ప్రారంభం కాగా... బుధవారం సాయంత్రం వరకు 25.55 లక్షల మొక్కలను నాటారు. 29,102 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరిచారు. 18,599 కిలోమీటర్ల మేర డ్రైనేజీలను శుద్ధి చేశారు. 50 వేల ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. నీళ్లు నిలవకుండా 11,876 లోతట్టు ప్రాంతాలను గుర్తించి చదును చేశారు. బుధవారం ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)