Breaking News

‘మీరంతా స్వర్గానికే’.. వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Tue, 08/05/2025 - 17:33

లక్నో: అనూహ్యంగా సంభవించే వరదల కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోతుంటారు. తాజాగా, అలా సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.  

ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 402 గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరద బాధితుల్ని మంత్రి సంజయ్ నిషాద్ పరామర్శించారు. ఓ ప్రాంతానికి వెళ్లిన ఆయనకు వరద బాధితులు తమ బాధల్ని చెప్పుకున్నారు. వరదల కారణంగా తాము కట్టు బట్టలతో సహా అన్నీ కోల్పోయామని వాపోయారు.

అయితే అందుకు మంత్రి సంజయ్ నిషాద్‌ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనంతో వారు స్వర్గానికి వెళతారు. విపక్షాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వరద బాధితులు మంత్రి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సదరు మంత్రి వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఏ ప్రాంతానికి వచ్చామనే సోయిలేకుండా పోయిందని మండిపడుతున్నారు. 

ఎందుకంటే ఆయన సందర్శించిన గ్రామాలు గంగా నది వద్ద కాకుండా యమునా నది ఒడ్డున ఉన్నాయని చెబుతూ విస్తుపోతున్నారు. కాగా రాష్ట్రంలో 402 గ్రామాలకు వరద ముంపుకు గురయ్యారు. గంగా, యమునా వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)