Breaking News

బీజేపీ ప్లాన్‌ అదే.. షిండే ముందున్న మార్గమిదే: అథవాలే

Published on Tue, 12/03/2024 - 17:18

ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్‌నాథ్‌ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్‌ చేశారు.

మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే.. ఏక్‌నాథ్‌ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.

అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్‌ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు. 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు