Breaking News

ఇదే మా సవాల్.. మీ సవాల్‌కు మేము కూడా సిద్ధమే!

Published on Thu, 03/13/2025 - 19:31

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు.  దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.

పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి,  మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)