Breaking News

‘ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదు’

Published on Fri, 05/02/2025 - 19:36

హైదరాబాద్: తన పరిధిలో ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దీనికి సంబంధించి తన పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పొన్నం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. చిన్నస్థాయి నుంచి మంత్రిగా ఎదిగానని, తనపై వచ్చిన అవినీతి మరకలను నిరూప్తిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు.

తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని, తన దగ్గరున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకూ మంచి సంబంధాలున్నాయన్నారు. ఇలంబర్తికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అధికారుల బదిలీలు ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదన్నారు. 

ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్త కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం.  2024  జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం.  ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో  2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు.  

ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్( MAUD) సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ పై అవినీతి ఆరోపణలు రావడం, దానికి ఇలంబర్తి అంశాన్ని లింకు పెట్టడంతో వివాదం పెద్దదిగా మారింది. దీనిపై పొన్నం ప్రభాకర్‌ వివరణ ఇవ్వడమే కాకుండా అవినీతిని నిరూపించాలంటూ సవాల్‌ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)