Breaking News

ఆ జిల్లాలు పచ్చబడటం మీకు ఇష్టం లేదు

Published on Fri, 07/14/2023 - 05:20

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివక్షా పూరితంగా ఉందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్య శ్యామలం చేసేందుకు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ఈ జిల్లాలు పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నప్పటికీ.. ఇంకా అదే ధోరణితో వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి రాసిన బహిరంగ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిపై తీవ్ర నిరాశతో ఈ లేఖ రాసినట్లు తెలిపారు. 

తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం
‘తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారా యణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం.  

ఈ ప్రాజెక్టు పూర్తయితే దాని పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుంది. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు కరువు కాటకాలతో  తల్లడిల్లేవి.  తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్‌నగర్‌ జిల్లా వలసల పాలయింది. అయితే మిషన్‌ భగీరథతో నల్లగొండలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టాం.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాం. కానీ కేంద్రం అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోంది. జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. పాలమూరు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్రం, పాలమూరు రంగారెడ్డికి మొండిచేయి చూపించడం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం..’ అని కేటీఆర్‌ ఆ లేఖలో ధ్వజమెత్తారు. 

నీటివాటా తేల్చలేదు..
‘కృష్ణా జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్రం తాత్సారం చేస్తోంది. నీటి వినియోగ అంశం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నా,  కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేశారు. కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ  తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండా,  కనీసం ట్రిబ్యునల్‌కి పంపకుండా 9 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)