Breaking News

గుజరాత్‌కు ఇస్తరు.. తెలంగాణకు ఎందుకు ఇవ్వరు?: కేటీఆర్‌

Published on Fri, 02/10/2023 - 16:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. బడ్జెట్‌ పద్దులపై చర్చల్లో సింగరేణిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ ఈటల రాజేందర్‌కు మంత్రి చురకలంటించారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్‌కు గనులు వస్తాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. ఏ కారణంతో అమ్మాల్సి వస్తుందని నిలదీశారు. సింగరేణి విషయంలో కూడా ఇదే వైఖరిలో కేంద్రం ఉందన్నారు. గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గనులు నామినేషన్‌ బేసిస్‌ ఇస్తరు కానీ.. తెలంగాణ సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈటలకు అంతా చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రాన్ని నిలదీసి అడగాలని సవాల్‌ విసిరారు. ఒకరి కోసం దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలా ఒక వ్యక్తినే పల్లకిలో తమ సర్కార్‌ మోయదని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
చదవండి: ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌.. అరెస్ట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)