Breaking News

తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్‌

Published on Tue, 08/15/2023 - 12:31

సాక్షి, సిరిసిల్ల: అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామన్నారు. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని చెప్పారు.

దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు.

అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
చదవండి: తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం: సీఎం కేసీఆర్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)