Breaking News

గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?: కొండా సురేఖ

Published on Fri, 08/09/2024 - 21:04

సాక్షి, హైదరాబాద్‌: గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడితే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కాగా, మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్‌ గతంలో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?. పనికి రానీ మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీనే. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్‌లే. లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా?. రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)