Breaking News

‘తెలంగాణ ఇచ్చిన పార్టీ థర్డ్‌ గ్రేడ్‌ పార్టీనా?’

Published on Thu, 08/21/2025 - 18:52

హైదరాబాద్‌:  భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్‌ పార్టీని థర్డ్‌ గ్రేడ్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడటం  ఆయన అహంకారానికి నిదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసేనని, మీకు థర్డ్‌ గ్రేడ్‌ పార్టీలా కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ ఎటువంటి పార్టీనో మీ తండ్రి కేసీఆర్‌ను అడిగితే చెబుతారన్నారు. 

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూఫ్‌ పోటో దిగింది మర్చిపోయారా? అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. ‘మా పార్టీ పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు..మీ తెలంగాణ వాదం పై సందేహాలు తలెత్తుతున్నాయి. 

తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావ్. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై చులకనగా మాట్లాడడం..అమెరికాలో చదివిన మీ  విజ్ఞతకు వదిలేస్తున్న. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పిఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ. 

రాజకీయంతో సంబంధం లేకుండా దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. యూరియా ఎందుకు రావట్లేదో  అంత మాత్రం తెలియదా?, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్’ అని ప్రశ్నించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)