Breaking News

‘మీరు మాత్రం సినిమాలు ఆపరు.. హెరిటేజ్‌ మూయరు’

Published on Thu, 10/19/2023 - 17:33

సాక్షి, విశాఖ:  చంద్రబాబు కోసం ప్రజలు ఎందుకు రోడ్లు మీదకు వచ్చి నిరసన తెలపాలని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈరోజు(గురువారం) విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కారుమూరి..  ‘చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేరు. చంద్రబాబు బాధలో ఉంటే ఎందకు సినిమా రిలీజ్‌ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు. హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే సంస్థ ప్రకటించింది.బాబు కోసం హెరిటేజ్ ముయారు, బాలయ్య సినిమాలు ఆపరు. చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు?, చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్‌ చేశారు. హెరిటేజ్‌ను ఎందుకు మూయ్యలేదు. ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా?, బీసీలు బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. బీసీల గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్. లక్ష 11 వేల కోట్ల రూపాయలు బీసీలకు ఖాతాల్లో వేశారు.

 రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ లెక్కలు చెప్తున్నది నీతి అయోగ్. బాబు హయాంలో బీసీలను మోసం చేశారు. జగన్ హయాంలో స్కీం లు,  బాబు హయాంలో స్కామ్‌లు. బాబును అరెస్ట్‌ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటి?,  బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గరని తప్పుడు  ప్రచారం చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే. సీఎం జగన్ కు వ్యతరేక ఓటు ఎక్కడుంది. చీలనివ్వను అని పవన్ అనడానికి. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని బస్సు యాత్ర ద్వారా వివరిస్తాం. చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు?, హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు’ అని నిలదీశారు.
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)