Breaking News

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్‌

Published on Fri, 11/03/2023 - 16:58

సాక్షి, విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

ఆంధ్రప్రదేశ్ గురించి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తెలంగాణ చెయ్యని మేలు ఏపీలో తాము చేశామని తెలిపారు. కోవిడ్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని, ఏపీలో తాము ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ ఏపీలో వర్కౌట్‌ కాదని విమర్శించారు. 

‘ఆంధ్రప్రదేశ్ ధాన్యం తెలంగాణలో అమ్ముతున్నారని కేసీఆర్ చెప్తున్నారు. మేము ఏపీలో ధాన్యం కొన్న తర్వాత మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించాం. ఇంటింటికి వెళ్లి బియ్యం ఇస్తున్నాం. మీరు మాములు బియ్యం ఇస్తుంటే మేము సర్టెక్స్ బియ్యం ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇస్తున్న సరుకులు మీరు తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు. 

హైదరాబాద్‌లో ఇళ్ల మీద నుంచి నీళ్ళు వెళ్తుంటే కేసీఆర్ ఏం చేశారు? ఏపీలో అమలు చేసినన్నీ సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చెయ్యగలిగారా? కేసీఆర్ ఎన్నికల కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడుకోండి. కానీ మా రాష్ట్రాన్ని విమర్శించడం హాస్యాస్పదం. ఆంధ్రాలో ఉన్న సన్న బియ్యం తెలంగాణకు తీసుకెళ్లడం లేదా..?’ అంటూ కేసీఆర్‌ను మంత్రి కారుమూరి ప్రశ్నించారు.
చదవండి: చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తోంది’

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)