Breaking News

సీఎం అక్కర్లేదు.. మీ అవినీతిని నేను నిరూపిస్తా!

Published on Sun, 10/20/2024 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఎవరి ఆదాయం ఎంతో.. ఎవరెంత దోచుకున్నారో ఎల్‌బీ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఇంటికి రానవసరం లేదని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్, అధికార ప్రతినిధి భవానిరెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, తానే వస్తానని అన్నారు.

కేసీఆర్‌ కుటుంబం పదేళ్లు సాగించిన అక్రమాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానని అన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అంటున్న వాళ్లు.. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్లాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ లో రూ.లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. తెలంగాణను మొత్తం దోచుకు న్నదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని, వాళ్లే ఇప్పుడు తాము నీతిమంతులమని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్‌ జోన్‌ అని జీవో నెంబర్‌ 7 ఇచ్చిందని, 50 మీటర్ల బఫర్‌ జోన్‌లో నా ఇల్లు కూడా పోతుందని జూపల్లి వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)