Breaking News

ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్‌

Published on Fri, 01/12/2024 - 15:25

సాక్షి, ఎన్టీఆర్‌: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్‌ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్‌సీపీలో చేరారని తెలిపారు.

నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్‌ను మంత్రి జోగి రమేష్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్‌ జగన్‌పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు.

నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ  అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)