Breaking News

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం పురోగతి

Published on Mon, 10/23/2023 - 03:24

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు దంపతులు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోమటి చెరువువద్ద మంత్రితో మహిళలు, యువతులు సెల్పిలు, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. మహిళలు తీసుకువచ్చిన ఫలహారాలు తింటూ మంత్రి వారితో ముచ్చటించారు.

అనంతరం మాట్లాడుతూ ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా మారాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డామని, నేడు నీరు, విద్యుత్‌ సరఫరా నిరంతరం జరుగుతోందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

ప్రజలందరూ బతుకమ్మ పండుగ చేసుకున్న విధంగానే దసరాను కూడా వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఆధ్వర్యంలో తయారు చేసిన భారీ బతుకమ్మను మంత్రి హరీశ్‌రావు తిలకించారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)