Breaking News

‘ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం మాది’

Published on Mon, 10/23/2023 - 17:03

పార్వతీపురం మన్యం జిల్లా:  దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో సామాజిక సాధికార సన్నాహ సమీక్ష సభలో బొత్స మాట్లాడుతూ.. ‘నాలుగున్నర ఎనిమిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవి. 

ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి అధికారం దుర్వినియోగం చేశారు. అధికారులను వాడుకుని అవినీతి చేసినట్లు రుజువు అయింది కాబట్టి ఆయన బయటకు రావడం లేదు. నేటికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ చంద్రబాబు కాలం గడిపారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా?, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌ నాయకత్వంలో అన్ని పదవుల్లో బలహీన వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు’ అని తెలిపారు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)