Breaking News

చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్‌

Published on Wed, 04/03/2024 - 18:21

సాక్షి, చిత్తూరు జిల్లా: జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ  ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పూతలపట్టులో జన మహా సముద్రం కనిపిస్తోందన్నారు.

‘‘మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్‌ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం
పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్‌. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్‌ డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? 
పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్‌. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్‌ చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?. వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్‌. రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్‌. ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్‌. విలేజ్‌ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్‌. వాలంటీర్‌ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్‌. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్‌.. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి’’ సీఎం జగన్‌ కోరారు.

130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమం అందించాం..
పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధమా?. రూ.3వేల పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రైతు భరోసాకు రైతన్నలకు అండగా నిలబడ్డాం. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం. 130 సార్లు బటన్‌ నొక్కి సంక్షేమం అందించాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. చేశాడా?. డ్వాక్రా రుణమాఫి అన్నాడు.. ఒక్క రూపాయి అయినా చేశాడా?. ఆడబిడ్డ పుడితే 25 వేలు  డిపాజిట్‌ చేస్తా అన్నాడు.. చేశాడా?. ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ కూడా గుర్తురాదు’’ అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది..
ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారు. అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది. ఇలాంటికి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా?. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్‌ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం జగన్‌ చెప్పారు.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)