Breaking News

లోఫర్‌ లోకేశ్‌.. అని నేననగలను..

Published on Mon, 08/28/2023 - 05:45

నూజివీడు: లోఫర్‌ లోకేశ్‌ అని తానూ అనగలనని, అయితే అలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని, ఎందుకంటే తనకు సంస్కారం ఉందని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు నారా లోకేశ్‌పై మండిపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన కుమారుడిని కేటుగాడని అనడంపై ఆదివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించి లోకేశ్‌ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

దమ్ముంటే నూజివీడు సెంటర్‌కొచ్చి కేటుగాడని మాట్లాడతావా అని సవాల్‌ చేశారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నిన్ను ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే ప్రజలు తన్ని తరిమేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నిజాని­జాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. నూజి­వీడు వచ్చి రౌడీయిజం చేయా­ల­ని ప్రయత్నించినా, ప్రోత్సహించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.    

లోకేశ్‌ పాదయాత్ర అట్టర్‌ ఫ్లాప్‌ 
లోకేశ్‌ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో అట్టర్‌ఫ్లాప్‌ అయిందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ చెప్పారు. కనీసం వెయ్యి మంది కూడా లోకేశ్‌ వెంట నడవలేదని ఎద్దేవా చేశారు. ఇక నియోజకవర్గంలో ఇసుకను దోచుకున్నది, నీరు–మట్టి పథకంలో మట్టిని దోచుకున్నదీ ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. భూకబ్జాలంటూ చెబుతున్నారని, ఎక్కడ భూకబ్జా చేస్తున్నానో చూపిస్తే అదే భూమిని చంద్రబాబుకు, లోకేశ్‌కు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రాసిస్తానన్నారు.

ఇక మాగంటి బాబు సినిమాల్లో నటిస్తే బెటరని, బాగా రాణిస్తారని ఎమ్మెల్యే ప్రతాప్‌ ఎద్దేవా చేశారు. శనివారపుపేట నుంచి బ్లేడ్‌ బ్యాచ్‌ను తీసుకొచ్చారని అంటున్నారని, రాష్ట్రంలో బ్లేడ్‌బ్యాచ్‌ల అడ్రస్‌లు, పేకాట క్లబ్‌లు, లిక్కర్‌ మాఫియా అడ్రస్‌లు మాగంటి బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియవన్నారు. లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని, టీడీపీ ఇక అధికారంలోకి రాదని మేకా ప్రతాప్‌ చెప్పారు.   

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)