Breaking News

ఎవరు నటిస్తున్నారో తెలుసు.. మీనాక్షి మరో వార్నింగ్‌

Published on Wed, 03/05/2025 - 16:44

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ మరోసారి హెచ్చరించారు.  పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్‌, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్‌గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన  సంగతి తెలిసిందే. పార్టీ లైన్‌ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్‌ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

గాంధీభవన్ లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్ష

 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)