Breaking News

క్షమించు అత్తా.. ఇక నిన్ను బాధించే పని చేయను..!

Published on Sun, 04/13/2025 - 21:31

మాయవతి మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌.. పార్టీలోకి వస్తూ పోతూ రావడం చాలా సందర్భాల్లోనే జరిగింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం, ఆపై మళ్లీ రావడం పరిపాటిగా మారిపోయింది. గత నెలలో మేనల్లుడి చర్యలపై కోపాద్రిక్తురాలైన మాయావతి.. అన్ని బాధ్యతల్ని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  అయితే ఇప్పుడు ఆకాశ్‌ ఆనంద్‌ తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ అత్త మాయావతిని వేడుకుంటున్నాడు. తనను క్షమించాలని,  ఇక నుంచి బాధించే పనులు ఏమీ చేయనని కాళ్ల బేరానికి వచ్చారు. 

‘నేను చేసిన అన్ని తప్పులను క్షమించి తిరిగి నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి. పార్టీలోకి నన్ను తీసుకోండి. నేను పార్టీకి, మా అత్త మాయావతికి రుణపడి ఉంటాను.ఇక తిరిగి ఎప్పుడూ ఎటువంటి తప్పిదాలు చేయను.పార్టీకి నష్టం చేసే పనులు అస్సలు చేయను’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు ఆకాశ్ ఆనంద్‌

అత్త మాయవతిని బాధించే పని చేయను..
తాను ఇక నుంచి మాయవతి చెప్పినట్లే నడుచుకుంటానని, ఎవర్నుంచి ఏ విధమైన తప్పుడు సలహాలు తీసుకోనని పేర్కొన్నాడు. బీఎస్పీలో ఉన్న సీనియర్ల నుంచి ఏమైనా మంచి విషయాలు ఉంటే నేర్చుకుంటానని స్పష్టం చేశాడు.

గత నెలలో బహుజన్ సమాజ్ పార్టీ  అధినేత్రి మాయవతి.. తన మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. గతేడాది కూడా ఆకాష్‌ ఆనంద్‌ పై వేటు పడింది. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలోమరోసారి బాధ్యతల నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్‌  స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్‌ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించగా, మరొకసారి బహిష్కరణకు గురయ్యాడు ఆకాశ్ ఆనంద్. ఇలా పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం, మళ్లీ తిరిగి పార్టీలోకి రావడం ఆకాశ్‌ ఆనంద్‌ కు అలవాటే.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)