Breaking News

రాజకీయాల నుంచి వైదొలగడం లేదు: మాయావతి

Published on Mon, 08/26/2024 - 13:57

లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్‌ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.

‘‘డాక్టర్. అంబేద్కర్‌, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్‌ ముందుకు తీసుకువెళ్తారు. నాపై  వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్‌’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా  ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.

 

 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)