Breaking News

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్‌

Published on Sun, 07/07/2024 - 13:43

చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్‌స్ట్రాంగ్‌ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్‌ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు  పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు.  హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను డిమాండ్‌ చేశారు.

 

ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును  గమనిస్తే.. తమిళనాడులో అసలు​ శాంతి భద్రతలు  లేవనిపిస్తోందని అన్నారు.  సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని  అన్నారు. ఈ ఘటనను  బీఎస్పీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.

బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్‌ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్‌ గాంధీ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా..  అప్పటికే ఆయన మృతి చెందినట్లు  డాక్టర్లు నిర్ధారించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)