Breaking News

గొర్రెలు, బర్రెలు కాదు.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వండి

Published on Sat, 07/22/2023 - 02:10

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకా­ల సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని   జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

బీఎస్పీ ఫ్లోర్‌ లీడర్‌ శ్యామ్‌ సింగ్, ఎంపీ బినోయ్‌ విశ్వమ్, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, మల్లు రవి మద్దతు తెలిపారు. వందలాది మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీ సంఘాల నాయకులు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ‘ఓట్లు బీసీలవి– సీట్లు అగ్రకు లాలవా.. రాజ్యాధికారంలో వాటా కావాలి‘ అంటూ నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌ గుజ్జ కృష్ణ,  ప్రధాన కార్యదర్శి నందగోపాల్‌ రాజ్‌ కుమార్, నేతలు గోవింద్, కర్రి వేణు మాధవ్, బాషయ్య, పరశురామ్‌ నాయకత్వం వహించారు.

బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారు: కృష్ణయ్య
ధర్నాను ఉద్దేశించి ఆర్‌.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అ గ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టా రని... కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికా­రంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు – బర్రెలు పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)