Breaking News

మార్గదర్శి అక్రమాలపై చర్చ.. తోకముడిచిన జీవీ రెడ్డి

Published on Sat, 05/13/2023 - 16:29

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై బహిరంగ చర్చ అంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చివరికి తోక ముడిచారు. బిజీ షెడ్యూల్‌  కారణంగా రాలేకపోతున్నానంటూ  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు శనివారం సమాచారం అందించారు.

రామోజీరావు, మార్గదర్శి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జీవీరెడ్డి సవాల్‌ను స్వీకరించారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్‌సిటీలోగానీ, హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో గానీ రామోజీరావు సమక్షంలో ఈ చర్చను ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని జీవీరెడ్డికి ప్రతి సవాల్‌ కూడా విసిరారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా రేపు (మే14న)  చర్చ జరగాల్సి ఉంది. అయితే.. 

మార్గ­దర్శి అక్రమాలకు వత్తాసు పలుకుతూ చర్చకు సవాల్‌ విసిరిన జీవీరెడ్డి..  ఇపుడు బిజీ పేరుతో వెనక్కి తగ్గడం దేనికి సంకేతం? చర్చను ఎదుర్కొనే ధైర్యం లేక, భంగపాటు తప్పదనే భయంతోనే ముందుగానే చక్కబడినట్టు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాగా దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కూడా చేపట్టింది. ఈ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)