Breaking News

ఇండియా కూటమికి రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్‌

Published on Tue, 08/01/2023 - 18:45

ఢిల్లీ: మణిపూర్‌ అంశంపై తనతో చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్‌ ఇచ్చారు. బుధవారం ఉదయం విపక్ష ఎంపీలతో భేటీ కానున్నారు. మణిపూర్‌ అంశంపై జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే అక్కడ పర్యటించాలని వాళ్లు ఆమెను కోరే అవకాశాలూ లేకపోలేదు.

మణిపూర్‌ వ్యవహారంపై తమ ఆందోళనను పట్టించుకోవాలంటూ  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు.  ఉదయం 11.30 సమయంలో తనను కలవాలని ఆమె వాళ్లకు సూచించారు. 

ఇండియా కూటమిలో  21 పార్టీల ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు-హింసకు నెలవైన కొండాలోయ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి బాధితులను కలిశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణ టైంలో మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ  మెమొరాండం సమర్పించారు కూడా. 

ఈ క్రమంలో ఇండియా కూటమి ఎంపీల మణిపూర్‌ పర్యటనపైనా బీజేపీ మండిపడింది. ఇటు పార్లమెంట్‌ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ.. డ్రామాలు ఆడుతోందంటూ ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్‌లో మణిపూర్‌ హింసపై సుదీర్ఘ చర్చ జరగాలని.. ప్రధాని ప్రసంగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభను సజావుగా జరగనివ్వకుండా నినాదాలతో హెరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌ అంశంపైనా అవిశ్వాసం ప్రకటించగా.. 8,9 తేదీల్లో చర్చ జరగాల్సి ఉంది. 

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు