Breaking News

పోరాడతాం లేదా చనిపోతాం: ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ

Published on Tue, 06/02/2026 - 17:56

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.

మొదట ఎస్ప్లానేడ్‌లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్‌కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్‌ పాలిటిక్స్‌తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 

“వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.

కోల్‌కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)