ఈనెల 12న పొంగులేటి ప్రకటన ఉండొచ్చు!: మల్లు రవి

Published on Sat, 06/10/2023 - 18:58

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీడ్‌ పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవితో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, జూపల్లి కృష్షారావు కలిశారు. 

కాగా, వీరి భేటీ అనంతరం మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగాయి. నాగర్‌ కర్నూల్‌లో నాగం జనార్ధన్‌ రెడ్డితో చర్చిస్తాం. నాగంతో ఇప్పటికే జనారెడ్డి చర్చించారు. జూపల్లి కృష్ణారావుతో చర్చించాం. ఈనెల 12న పొంగులేటి శ్రీనివాస్‌ నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత లేదు అని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. మల్లు రవి నివాసానికి వనపర్తి నియోజకవర్గానికి చెందిన  పెద్ద మందాడి బీఆర్‌ఎస్‌ ఎంపీపీ మేఘా రెడ్డి చేరుకున్నారు. మల్లు రవితో మేఘారెడ్డి భేటీ అయ్యారు. కాగా, కొన్ని రోజుల క్రితమే మేఘారెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్‌ నేతలపై థాక్రే సీరియస్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)