Breaking News

కంటోన్మెంట్‌లో కారుణ్య నియామకాలు చేపట్టండి

Published on Tue, 10/15/2024 - 05:29

సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా మహ మ్మారి వేళ కంటోన్మెంట్‌లో పనిచేసిన మున్సి పల్‌ కార్మికులు సుమారు వంద మందికి పైగా మృతి చెందారు.

ఐదు శాతం కంటే ఎక్కువ మందికి కారుణ్య నియామకాలు చేపట్టవద్దని రక్షణ శాఖ నిబంధన ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించి కరోనా సమయంలో మృతి చెందిన మున్సిపల్‌ కార్మికుల కుటుంబాలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్‌ తెలిపారు.

జేసీఓపీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకారం
18వ లోక్‌సభ ‘జాయింట్‌ కమిటీ ఆన్‌ ఆఫీసెస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌’ చైర్మన్‌గా సోమవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయనకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీకి ఈటల చైర్మన్‌ కాగా.. తొమ్మిదిమంది లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)