Breaking News

మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం

Published on Sun, 01/07/2024 - 15:20

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని పేర్కొంది. ప్రభుత్వ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది.  

లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా  వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు.

ఖండించిన మాజీ అధ్యక్షుడు..
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు.  ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి మిత్రుడని అన్నారు. 

"ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారతదేశానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అన్నారు.

ఇదీ చదవండి: ‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్‌ పరిస్థితి ఏంటి?’
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)