Breaking News

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

Published on Wed, 06/17/2026 - 15:40

ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌ సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేపుతోంది. ఆ పార్టీలో చీలికలు మొదలయ్యాయని, మైనింగ్‌ కేసులో ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ జైలుకెళ్తారంటూ ఆ రాష్ట్ర పంచాయతీ, సంక్షేమ శాఖ మంత్రి ఓపీ ప్రకాష్ రాజ్ భర్ బాంబు పేల్చారు. ఇటీవల మహరాష్ట్ర,పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేతలు సొంత పార్టీలను వీడి అధికార బీజేపీలో చేరేందుకు క్యూకడుతున్నారు.

ఈ క్రమంలో యూపీ మంత్రి ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ మీడియాతో మాట్లాడారు. త్వరలో సమాజ్ వాదీ పార్టీలో ఒక పెద్ద చీలిక రాబోతోంది. ఇప్పటికే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మైనింగ్ కేసులో సీబీఐ అఖిలేష్ యాదవ్ పేరు ఉందని త్వరలోనే జైలుకు వెళ్తారు. ఇందులో భాగంగానే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయమై రామ్‌గోపాల్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీని వీడి బీజేపీలో చేరే నేతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందని కూడా చెప్పారని తెలిపారు.   

అయితే ఆ లేఖలో పార్టీ మారుతున్న నేతల పేర్లు, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు స్పష్టంగా లేవు. మీడియా ప్రశ్నించగా ఓంప్రకాష్‌ రాజ్‌భర్‌ మాట్లాడుతూ.. ‘ఎస్పీని వీడే నేతల వివరాలు నాకు తెలుసు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి అలాగే జరగనివ్వండి. ఇప్పుడు నేను చెప్పితే నాశనం అవుతుంది. మరికొన్ని రోజులు ఆగితే ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు’ అని అన్నారు.

ఇక లేఖపై రామ్‌గోపాల్‌ యాదవ్‌ స్పందిస్తూ.. ‘నేను లేఖ రాశానని మీరంటున్నారు. ఆ లేఖ గురించి అమిత్‌షాను అడగండి. దేశంలో ఎవరూ ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ను సీరియస్‌గా తీసుకోరు. ఆయన ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు’ అని వ్యాఖ్యానించారు. ఆయన అవన్నీ వదంతులేనని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు. 

అఖిలేష్ యాదవ్ కు  బిగ్ షాక్..! సమాజ్ వాదీ పార్టీలో భారీగా చీలికలు

గమనించదగ్గ విషయం ఏమిటంటే, సుహుల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓంప్రకాష్‌ రాజ్‌భర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలు గెలుచుకున్నారు. కొద్ది నెలలకే ఎస్పీకి గుడ్‌బై చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన యూపీ కేబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు.

కాగా, మహారాష్ట్ర, బెంగాల్ తర్వాత ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. ప్రతిపక్షంలో అత్యంత కీలకమైన రెండు పార్టీలు టీఎంసీ, శివసేన(యూటీబీ) పార్లమెంట్ శ్రేణుల నుంచి తిరుగుబాటుతో కుదేలవుతున్న తరుణంలో యూపీ మంత్రి కీలక ప్రకటన సంచలనంగా మారింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)