మహువా మొయిత్రాకు మరో షాక్‌

Published on Wed, 01/17/2024 - 09:07

ఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్‌ తగిలింది. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీకాగా.. సంబంధిత అధికారులు నేడో, రేపో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా పై డిసెంబర్‌ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. ఆ వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ మహువాకు కిందటి నెలలోనే నోటీసు వెళ్లింది. జనవరి 7వ తేదీ లోపు బంగ్లా ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల సారాంశం. 

ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈలోపు గడువు ముగియడంతో డీవోఈ జనవరి 8వ తేదీన.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ ఆమెకు నోటీసులు పంపింది. మూడు రోజులు గడిచినా ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో.. 12వ తేదీన మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డీవోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. మంగళవారం నాడు తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపింది డీవోఈ. అంతేకాదు.. ఆలస్యం చేయకుండా ఆమెతో బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

Videos

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

దేవుడా..నా దొంగతనం సక్సెస్ కావాలి

విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)