Breaking News

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు

Published on Fri, 09/13/2024 - 08:29

సాక్షి,హైదరాబాద్‌: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం (సెప్టెంబర్‌13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. 

స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్‌ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. 

అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ ‍ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు. 

ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)