Breaking News

షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి

Published on Tue, 07/16/2024 - 01:53

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి షరతులు..నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయా లని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ రుణమాఫీ ఇవ్వలే కనే కాంగ్రెస్‌ ప్రభుత్వం షరతులతో కొత్తకథలు చెబుతోందని మండిపడ్డారు. దీనిపై గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు విధించని విషయాన్ని గుర్తుచేశారు.సోమవారం ఆయన మీడియాతో 

మాట్లాడుతూ ఏ నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇన్ని కండిషన్స్‌ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు రుణ మాఫీకి మాత్రం రేషన్‌కార్డును లింక్‌ చేస్తోందని ధ్వజమెత్తారు. చాలామందికి ఇది వర్తించకుండా ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఒకే రేషన్‌కార్డుపై చాలామంది పేర్లు ఉంటాయని, అందులో నలుగు రికి రుణాలుంటే ఒక్కరికే మాఫీతో మిగతావారు నష్ట పోతారన్నారు. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే  వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి చేర్చుకోవాలని సీఎంకు సూచించారు. 

సీఎం రేవంత్‌కు మరో బహిరంగలేఖ 
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగలేఖలో మహేశ్వర్‌రెడ్డి కోరారు. పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు వెల్లడించినా.. సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీరులో మార్పు రాకపోతే ప్రజాక్షేత్రంలో సర్కార్‌ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)