Breaking News

టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌!

Published on Sun, 09/01/2024 - 05:51

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సారథితోపాటు పశి్చమ బెంగాల్‌కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నియామకానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత పత్రంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

రెండు నెలలుగా కసరత్తు.. 
ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్ష నియామకంపై గడిచిన రెండు నెలలుగా కసరత్తు జరుగుతుండగా, వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పది రోజుల కిందటే మరో దఫాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గ నేతకే పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.

బీసీల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మహేశ్‌గౌడ్‌తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ల అభ్యర్థిత్వాలపై చర్చించారు. వారి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియా గాం«దీకి కట్టబెట్టారు. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పారీ్టకి సేవలందిస్తూ రాష్ట్ర నేతలందరితో సన్నిహిత సంబంధాలుగల మహేశ్‌ గౌడ్‌ వైపు ఏఐసీసీ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏ క్షణమైనా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)