Breaking News

కార్యవర్గానికి.. కొంత సమయం!

Published on Tue, 09/10/2024 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రాష్ట్ర పారీ్టకి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో పార్టీ పదవులు, టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినా కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, వారి సల  హా మేరకు కమిటీలను కూర్చి, ఆ కమిటీలపై హైకమాండ్‌ ఆమోద ముద్ర వేయించుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్షునిగా ఈనెల 15వ తేదీన మహేశ్‌గౌడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నా    యి. మహేశ్‌గౌడ్‌ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని, అధ్యక్ష పదవి అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని గాంధీభవన్‌వర్గాలు చెబుతున్నాయి.  

ప్రచార కమిటీని నియమిస్తారా? 
టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో గతంలో ఉన్న మిగిలిన కమిటీలను కొత్తగా ని యమిస్తారా లేక వాటినే కొనసాగిస్తారా అనే చర్చ ప్రారంభమైంది. టీపీసీసీకి అనుబంధంగా ఏడెని మిది కమిటీలు పనిచేస్తుంటాయి. వీటిలో టీపీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమి టీ లాంటి వాటిని కొత్తగా ప్రకటిస్తారని గాం«దీభవ న్‌ వర్గాలంటున్నాయి. టీపీసీసీకి ప్రచార కమిటీని నియమిస్తే దానికి చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి పదోన్నతి కలి్పంచి ఆ పదవిలో నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అందులో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.

ఇక, జగ్గారెడ్డితో పాటు అంజన్‌కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డిలు వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణల మేరకు గతంలో నియమించిన ఈ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల స్థానంలో కొత్త వారు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తారని, వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

వీరితో పాటు సీనియర్‌ ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్‌ నేతలను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంత మంది ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అధికార ప్రతినిధుల జాబితాలో మాత్రం మార్పులు చేస్తారని సమాచారం. అన్ని పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే నెలలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు జరుగుతుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు వెల్లడించారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి