Breaking News

Devendra Fadnavis: నాడు శపథం చేసి.. నేడు సీఎం రేసులో ముందంజలో..

Published on Sat, 11/23/2024 - 14:24

మహారాష్ట్రకి ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేసి.. మరోసారి అధికారం అంచుల దాకా తీసుకెళ్లి.. చివరకు పార్టీ కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేశాడన్న పేరు ఉంది దేవేంద్ర ఫడ్నవిస్‌కు. మహారాష్ట్ర ఫలితాల వేళ.. సీఎం రేసులో మొదట వినిపించిన పేరు ఈయనదే. అలాగే.. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకే వచ్చింది. 

‘‘నా నుంచి బొట్టుగా నీరుపడుతోందని.. ఇల్లు కట్టుకోవాలని చూడకండి. నేనొక మహాసముద్రాన్ని.. కచ్చితంగా తిరిగి వస్తా.. అంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఐదేళ్ల కిందటి నాటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

‘‘కచ్చితంగా మావాడే సీఎం అవుతాడు. అందులో ఎలాంటి అనుమానాలే అక్కర్లేదు. తను 24 గంటలు నిద్రాహారాలు మానేసి కూటమి విజయం కోసం కృషి చేశాడు. ఈ ప్రయాణంలో కోట్లమంది అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం అతనికి ఉంది’’ అంటూ ఫడ్నవిస్‌ తల్లి సరిత అంటున్నారు. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవిస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్‌ ధరేకర్‌ చెబుతున్నారు. రేపు ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులు వస్తారని, 25న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్‌ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)