Breaking News

బారామతి నుంచి అజిత్‌ పవార్‌ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల

Published on Wed, 10/23/2024 - 17:07

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ).. అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటించగాగా.. పార్టీ అధినేత అజిత్ పవార్‌ అతడి కుటుంబానికి కంచుకోట ఉన్న బారామతి స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

ఎన్సీపీకి చెందిన 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థులుగా తొలి జాబితాలో పేర్కొన్నారు. యెవ్లా స్థానం నుంచి ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు ఛగన్ భుజ్‌బల్, నవాపూర్ సీటు నుంచి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు గవిత్ కుమారుడు భరత్ గవిత్ బరిలోకి దిగుతున్నారు.

 కాగా, ఎన్సీపీకి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను దిండోరి నుంచి, గతంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అర్జుని-మోర్గావ్ నుంచి, అంబేగాన్ నుంచి దిలీప్ వైస్-పాటిల్, పార్లీ నుంచి ధనంజయ్ ముండే, కాగల్ నుంచి హసన్ ముష్రిఫ్ పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్‌పురి)లను కూడా ఎన్సీపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది.

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ. శివసేన(ఏక్‌నాథ్‌ షిండే)తో కలిసి ఎన్సీపీ(మహాయుతి కూటమి) పోటీ చేస్తుంది. ఇప్పటికే ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే కోప్రి-పచ్‌పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 20న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)