Breaking News

ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Published on Tue, 08/22/2023 - 15:33

ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 

'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు.

కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు!


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)