Breaking News

‘మహా’ కేబినెట్‌ విస్తరణ పూర్తి..అలిగిన శివసేన ఎమ్మెల్యే

Published on Sun, 12/15/2024 - 18:39

నాగ్‌పూర్‌:మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన 39 మంది నేతలు మంత్రులుగా ఆదివారం(డిసెంబర్‌15) ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ మంత్రులతో ప్రమాణం చేయించారు.

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌,డిప్యూటీసీఎంలు ఏక్‌నాథ్‌ శిండే,అజిత్‌ పవార్‌ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావాన్‌కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్‌, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరీశ్‌ మహాజన్‌, గణేశ్‌ నాయక్‌, మంగళ్‌ప్రభాత్‌ లోధా, జయ్‌కుమార్‌ రావల్‌, పంకజ ముండే, అతుల్‌ సావే, అశోక్‌ ఉయికే, ఆశిశ్‌ శేలార్‌, శివేంద్రసిన్హ భోసలే, జయ్‌కుమార్‌ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు. 

శివసేన నుంచి గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, సంజయ్‌ రాథోడ్‌, ఉదయ్‌ సామంత్‌, శంభూరాజ్‌ దేశాయ్‌, ఎన్‌సీపీ నుంచి ధనంజయ్‌ ముండే, హసన్‌ ముష్రిఫ్‌, దత్తాత్రేయ, అధితీ తాత్కరే, మానిక్‌రావ్‌ కొకాటే, నరహరి జిర్వాల్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు తనకు కేబినెట్‌ బెర్తు దక్కలేదని శివసేన ఎమ్మెల్యే, పార్టీ విదర్భ కో ఆర్డినేటర్‌ నరేంద్ర మోడేకర్‌ అలిగారు. పార్టీ కో ఆర్టినేటర్‌ పదవికి రాజీనామా చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)