Breaking News

సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడను: సీఎం రేవంత్‌

Published on Tue, 04/30/2024 - 19:17

సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్‌ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్‌షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించి, తనను అరెస్ట్‌ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని,  అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు.  వరంగల్‌ పట్టణానికి ఔటర్ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)