Breaking News

నేటి ఫైనల్‌ రౌండ్‌ ఛాంపియన్‌ ఎవరు? 2019లో ఏం జరిగింది?

Published on Sat, 06/01/2024 - 06:54

2024 లోక్‌సభ ఎన్నికల ప్రయాణం నేటితో ముగింపు దశకు చేరు​కోనుంది. నేడు (శనివారం,జూన్ 1) జరిగే ఏడో దశ పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలలో ఓటింగ్‌ జరగనుంది. చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు స్థానం వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, భోజ్‌పురి నటుడు రవి కిషన్, భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్, కాజల్ నిషాద్ తదితరులు నేడు జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

2019లో ఈ 57 సీట్లలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకుంది. టీఎంసీకి 9, బీజేడీకి 4, జేడీయూ, అప్నాదళ్ (ఎస్)కు చెరో రెండు సీట్లు చొప్పున వచ్చాయి. జేఎంఎం కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌  ఎనిమిది సీట్లు గెలుచుకుంది.

2024 లోక్‌సభ ఎన్నికల ఏడవ దశలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 56 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ 51 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. టీఎంసీ తొమ్మది మంది అభ్యర్థులకు టిక్కెట్‌ ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అకాలీదళ్ 13 మంది అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపింది. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. బిజూ జనతాదళ్ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.

2019 ఎన్నికల్లో మొదటి దశలో 70 శాతం ఓటింగ్ జరిగింది. 2024 మొదటి దశలో ఓటింగ్ శాతం 66.1గా ఉంది. 2019 రెండవ దశలో 70.1శాతం ఓటింగ్ నమోదైంది. 2024 రెండవ దశలో 66.7 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 మూడవ దశలో ఓటింగ్ శాతం 66.9శాతం. 2024 మూడో దశలో 65.7 శాతం ఓటింగ్ జరిగింది. 2019 నాలుగో దశలో 69.1 శాతం ఓటింగ్ జరగగా, 2024 నాలుగో దశలో 69.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఐదో దశలో 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 ఐదవ దశలో 62.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఆరవ దశలో 64.2 శాతం ఓటింగ్ జరిగింది. 2024 ఆరవ దశ ఎన్నికలలో 63.4 శాతం ఓటింగ్ జరిగింది. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)