Breaking News

ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా ఢిల్లీకి..

Published on Mon, 03/04/2024 - 03:38

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున పోటీ­చేసే ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను శని, ఆదివారం జరిగిన  సమావేశాల్లో సిద్ధంచేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌  జిల్లాల వారీగా ఆయా జిల్లాల పార్టీ అధ్య­క్షులు, కన్వినర్లు, ఇతర ముఖ్య­నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

శనివారం 14 లోక్‌సభ స్థానా­ల పరిధిలో జిల్లా నాయకుల సమావేశాలు జరగ్గా.. ఆదివారం మిగిలిన 11 లోక్‌సభ స్థానాల సమావేశాలు జరిగాయి. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాలకు సంబంధించి ఆయా జిల్లాల నేతల నుంచి అభి­ప్రాయాలు సేకరించాం. నియోజకవర్గాల వారీగా సామా­జిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం.

ఈ జాబితాలను జాతీ­య నాయ­కత్వానికి పంపుతాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానా­ల్లో పోటీచేసేందుకు రెండు వేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండ్రోజుల సమావేశాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. నిబంధనల ప్రకారం.. మేం ఇచ్చే జాబితాపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకులను పిలిచి అభ్యర్థుల తుది ఎంపికపై చర్చిస్తుంది. 

పొత్తుపై చర్చ జరగలేదు.. 
ఈ సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం అభ్యర్థుల ఎంపికకు సంబంధించే జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకున్నాం. పొత్తులపై జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ  జాతీయ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకునే పక్షంలో ఆ నిర్ణయాలకు అనుకూలంగా మేం మరోసారి సమీక్ష చేసుకుంటాం అని అన్నారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు