Breaking News

హస్తినకు బీజేపీ అభ్యర్థుల జాబితా 

Published on Wed, 03/06/2024 - 05:40

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ.. అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ అధిష్టానానికి పంపించింది. ఇందుకోసం జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌ విజయవాడలో శనివారం, ఆదివారాల్లో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల పేర్లతో జాబితాలను రూపొందించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురికి తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

9న ఢిల్లీలో భేటీకి అవకాశం 
లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఏపీ నేతలతో ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 6న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు ఊహగాహాలు ఊపందుకున్నాయి.

పొత్తులపై జాతీయ నాయకత్వం నేటికీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. పొత్తులో బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్యపై టీడీపీ నేతలకు మీడియాకు లీకులు ఇస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తుల ప్రచారానికి ఊతమిస్తూ.. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వచ్చింది.

తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్ర పర్యటకు వచ్చి ఒకే రోజున దాదాపు 15 లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించినా పొత్తులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా.. రాజ్‌నాథ్‌ పర్యటన తర్వాత జాతీయ నాయకత్వం సూచన మేరకు శివప్రకాష్‌ విజయవాడ వచ్చి అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)