Breaking News

బండి సంజయ్‌ ఎఫెక్ట్‌.. బీజేపీకి ఎదురుదెబ్బ!

Published on Wed, 07/05/2023 - 19:36

సాక్షి, జగిత్యాల: తెలంగాణ బీజేపీలో పెను మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను అధిష్టానం మార్చడం కారణంగా పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జిల్లాల స్థాయిలోని కీలక నేతలు బీజేపీకి గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక, బండి సంజయ్‌ మార్పు నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలోని కథలాపూర్‌ మండల ప్రజాప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. తక్కళ్లపల్లి సర్పంచ్ లక్ష్మితో పాటు, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు, లక్ష్మి భర్త శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. 

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు సంయమనంగా ఉండాలని సంజయ్‌ కోరారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించే పనులు చేయవద్దని తెలిపారు. ఇక, తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నట్టు వెల్లడించారు. అనంతరం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో బండి సంజయ్‌ భేటీ అయ్యారు. ఇక, సంజయ్‌కి ఏ పదవి ఇస్తారన్న దానిపై బీజేపీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. 

ఇది కూడా చదవండి: బీజేపీలో మరో బిగ్‌ ట్విస్ట్‌.. కోమటిరెడ్డికి జాతీయ పదవి

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)