Breaking News

అఖిలేష్‌ ర్యాలీ, ప్రియాంక రోడ్‌ షో..

Published on Wed, 04/17/2024 - 10:36

ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు.

ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్,  పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు  ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది.  ఎస్పీ అధినేత అఖిలేష్‌ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)