Breaking News

లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి

Published on Fri, 10/20/2023 - 13:13

సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్‌ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్‌ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు.

ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి  రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు.  2 శాతం హెరిటేజ్‌ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు

లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు.

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)