Breaking News

జనాలను మభ్యపెట్టేందుకే బాబు ‘విజన్‌’

Published on Sun, 12/15/2024 - 04:33

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్‌–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్‌–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్‌–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్‌–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్‌ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్‌లో ఎలాంటి మార్పూలేదు. విజన్‌–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్‌ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.

కానీ..  చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్‌ ఛార్జీలు వసూలుచేయమని ఉంది. 

మెడికల్‌ సీట్లు వద్దనడమే బాబు విజన్‌..
జగన్‌ హయాంలో 17 మెడికల్‌ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్‌ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్‌. అలాగే, వలంటీర్లు, బేవరేజ్‌ కార్పొరేషన్‌ సిబ్బందినీ  తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.

ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ, జగన్‌మోహాన్‌రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?

ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్‌ అరెస్టు..
అల్లు అర్జున్‌ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)