Breaking News

కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..

Published on Mon, 04/28/2025 - 09:03

కుప్పం మున్సిపల్‌ చైర్సన్‌ ఎన్నికల అప్‌డేట్స్‌..

  • చిత్తూరు..
  • కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ
  • సీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ
  • సంఖ్య బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్న టీడీపీ
  • కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా సెల్వ రాజ్ ఎన్నిక
  • 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక
  • టీడీపీ చైర్మన్ అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి హఫీజ్‌కు తొమ్మిది మంది మద్దతు, ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరు

కుప్పంలో 144 సెక్షన్‌

  • నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

  • బెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్‌లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్

  • కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లు

  • ఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం

  • బెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది  కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా

 

  • ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..

  • పోలీసుల  కనుసన్నల్లోనే కుప్పం

  • మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు  ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు

  • అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్,  92 మందితో మున్సిపల్ ఎన్నికలు 
     

గుంటూరు..

  • నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక
  • బలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వం
  • గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లు
  • వైఎస్సార్‌సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయం
  • వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు
  • ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలు
  • వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులు
  • కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలు
  • మేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్‌సీపీ..
  • అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు
     

👉ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో దౌర్జన్యం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్‌సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

👉వైఎస్సార్‌సీపీకి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్‌ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్‌ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు.   

నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక
👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్‌ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)